గ్రంథ అధ్యయనం (బుక్ రీడింగ్ సెషన్స్)
విశ్వస్ఫూర్తి ఎలివేట్స్ ది హ్యూమన్ మైండ్...
మనము ఒక చిన్న బావిలో ఉన్నామని ఊహించుకోండి. ఆ బావిలోంచి చూస్తే, చుట్టూ ఉన్నదంతా బావి గోడలే అనిపిస్తాయి. కానీ, మెట్టుమెట్టుగా పైకి ఎక్కితే మరింత పెద్దదిగా కనిపిస్తుంది. చివరికి పూర్తిగా బయటకొచ్చినప్పుడు, అపారమైన ప్రకృతి, అంతా కనిపిస్తుంది.
మన మనసు, మన జ్ఞానం ఉన్నత స్థితికి వెళ్లాలంటే ఆ ఎలివేషన్ జరగాలి. మూఢ నమ్మకాలు, మూఢ భక్తి, మూఢ విశ్వాసాలు పోవాలి. ఉన్న వాస్తవాలు తెలియాలి. ఆత్మ జ్ఞానం రావాలి. మరి అది ఎలా వస్తుంది? వేలాది సంవత్సరాలుగా ఎందరో దీనికోసం తమ జీవితాలే ధారపోశారు. అలాంటిది సమాజంలో బతుకుతూ, సాంసారిక విషయాలు చూసుకుంటూ ఇవన్నీ తెలుసుకోవటం ఎలా సాధ్యం? జ్ఞానం దాని సముపార్జన సాధారణ వ్యక్తులకు సాధ్యమా? అంటే సాధ్యమే అంటున్నాయి ఆధ్యాత్మిక విశ్వగురువు శ్రీశ్రీశ్రీ గురువిశ్వస్ఫూర్తి వారి విశిష్టమైన రచనలు.
సమాజానికి, మానవ జీవితానికి సంబంధించిన ప్రతి కోణాన్ని నిశితంగా పరిశీలించి అందరికీ ఆచరణ యోగ్యంగా, అనుకూలంగా ఉండే శారీరిక, మానసిక, ఆరోగ్య విషయాలతో పాటు, ఆధ్యాత్మిక సంబంధ విషయాలను గురించి పూర్ణ గురుదేవులు శ్రీశ్రీశ్రీ గురువిశ్వస్ఫూర్తి వారు తమ రచనల ద్వారా విపులంగా వివరిస్తున్నారు. సాంసారిక జీవితంలో ఎలా ఉండాలో, భౌతికం - ఆధ్యాత్మికం అంటే ఏమిటో, నిత్య జీవితంలో ఆ రెండూ కలిసి ఉండవలసిన ఆవశ్యకత ఏమిటో, నిత్య జీవితంలో మానసిక ఒత్తిడులను అధిగమించటం ఎలానో... ఇలా ప్రతి వారికీ నిత్యజీవితంలో ఉపయోగపడే ఎన్నో విషయాలను వారు స్వయంగా రచించిన గ్రంధాల ద్వారా వివరంగా తెలియజేస్తున్నారు.
స్వచ్చమైన అచ్చ తెలుగు వ్యావహారిక భాషలో వేదాలు, ఉపనిషత్తుల సారంతో పాటు భూగోళం నుంచి ఖగోళ రహస్యాల వరకు వారి గ్రంధాల ద్వారా వివరిస్తున్నారు. ఆధునిక సమాజంలో వస్తున్న మార్పులు - సమాజంపై దాని ప్రభావం, మతం మనిషి జీవితంలో ఎంత మేరకు ఉంటే మనిషి పురోగమనం సాధ్యం, ప్రజాస్వామ్యం ఎలా ఉంటే సమాజంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు వంటి అనేక విషయాలను వివరించారు.

గురువు అంటే కాషాయం వేసుకుని ప్రవచనాలు, పురాణాలు వల్లించటం మాత్రమే కాదని, సమాజానికి, వ్యక్తులకు దిశానిర్దేశం చేయాలనేది గురు విశ్వస్ఫూర్తి వారి అంతరంగం. మొదట మనిషి తన జీవితం, తన ఇల్లు చక్కబెట్టుకోవాలని, తన మనస్సును ఎలివేట్ చేసుకోవాలని, మనస్సు మార్పే మనిషిలో మార్పు అని, మనిషి మార్పే సమాజ మార్పు అని, తద్వారా ఆత్మీయతా సమాజ స్థాపన సాధ్యమని, బోధిస్తూ, మనిషి మనసులో మార్పు తీసుకురాగలిగే ప్రాక్టికల్ ఫిలాసఫీ, రెలిజియస్ హ్యూమనిజం, ప్రస్థాన ధ్యానం అనే నూతన కాన్సెప్ట్స్ ను వారు తమ గ్రంధాల ద్వారా వివరిస్తున్నారు. శ్రద్ధగా వాటిని చదివగలిగితే మనిషిని నిత్యం వేధించే అనేక సమస్యలకు అందులో సమాధానం దొరుకుతాయి అని మన అనుభవంలోకి రావడంతో పాటు మనిషి - మనసు - శరీరం - ప్రాణం - స్పిరిట్ - ఆత్మ తదితర అనేక విషయాలపై సమగ్రమైన అవగాహన ఏర్పడుతుంది.
ది సైంటిఫిక్ సెయింట్ శ్రీశ్రీశ్రీ గురువిశ్వస్ఫూర్తి వారు అనుగ్రహించిన అపారమైన జ్ఞానాన్ని స్ఫూర్తి కుటుంబ సభ్యులంతా భక్తి శ్రద్దలతో, ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా బుక్ రీడింగ్ సెషన్లు వివిధ జోన్లలో విస్తృతంగా నిర్వహిస్తున్నారు.

