ది సైంటిఫిక్ సెయింట్
సృష్టి - సృష్టి పరిణామం, ప్రకృతి - ప్రకృతి పరిణామం, అలాగే సృష్టికర్త / దేవుడు, ఆత్మ - పరమాత్మ ఇత్యాది విషయాల గురించి వివరించడానికి, మతం, వేదాంతం, విజ్ఞానశాస్త్రం యుగాల లెక్కన ఎన్నో సిద్ధాంతాలను ప్రతిపాదించాయి. ఏ సిద్ధాంతంలో కూడా ఒక స్పష్టమైన, సమగ్రమైన వివరణ లేదనేది కూడా చరిత్ర సాక్ష్యమే. మత సిద్ధాంతాలు ఒకదానితో మరొకటి అంగీకరించే స్థితిలో లేవు, అలాగే సైన్సు సిద్ధాంతాలు కూడా కాలానుగుణంగా కొత్త వాటితో మార్పుచెందడమే కానీ, ‘వాస్తవం ఇదీ’ అనే స్థిరమైన వాదన లేదు. ‘ఆత్మ - పరమాత్మ’ల గురించి వివరించే వేదాంతం కూడా వాటిని నిగ్గుతేల్చి, నిరూపించే స్థితిలో లేదనేది కూడా వాస్తవ అనుభవమే.
మతం, వేదాంతం, విజ్ఞాన శాస్త్రములు, విషయం ఒకటే అయినా, వేరు వేరు అవగాహనలతో, ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా పయనిస్తున్న స్థితిలో, అసలు ఏమిటి అనేది పసిగట్టలేని పరిస్థితిలో, యుగాలుగా పేరుకుపోయిన అజ్ఞానాంధకారాలను తొలగించడానికి ఈ భువిపై అవతరించారు ఒక దివ్య పురుషులు, వారే వారే..... శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి గురుదేవులు.
ఈ భువి నుండి విశ్వమూలం వరకు ఉన్న విశ్వజ్ఞానాన్ని అందించే విశ్వగురువుగా, ఆత్మ సంబంధ ఆధ్యాత్మికాన్ని సైన్సు పరిభాషలో వివరిస్తున్న వైజ్ఞానిక ఋషిగా, పరిపూర్ణ జ్ఞానాన్ని మానవాళికి అందిస్తున్న పూర్ణ గురువుగా, ‘న భూతొ న భవిష్యత్’గా భాసిల్లుతున్నారు.
ప్రాక్టికల్ ఫిలాసఫీ సిద్ధాంతంతో, పరమాత్మ తత్వాలైన సర్వజ్ఞత, సర్వశక్తివంతం, సర్వవ్యాప్తతను మానవ జాతి అనుభవంలోకి తీసుకువచ్చి, ధ్యానమనోప్రస్థాన సాధనను సూత్రీకరించి, రిలీజియస్ హ్యుమానిటీ సిద్ధాంతాన్ని ప్రదిపాదించి, మనిషిలో మానవత్వం, సమాజంలో ఆత్మీయత స్థాపనే లక్ష్యంగా, గ్లోబల్ మానవతా స్ఫూర్తే ధ్యేయంగా కృషిచేస్తున్నారు.

“Having been with the universal inspiration of the inventive and intuitional mind, caused by the influence and confluence of the science and conscience... it is my inclination of being coronated as The Scientific Saint” ... Sri Sri Sri Guru ViswaSphoorthi

