స్త్రీ సక్తి - సోషల్ స్ఫూర్తి
‘స్త్రీ’ అంటే ప్రకృతి స్వరూపిణి, సృష్టి కారకురాలు, సృష్టి మూలం (విశ్వమాత) గా అభివర్ణించారు శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి వారు. సమాజం తిరోగమన దిశగా ప్రయాణం సాగిస్తున్నప్పుడు, మానవ జాతిని, సంస్కరించి, సంస్కారవంతంగా తీర్చదిద్దగలిగే శక్తి - సామర్థ్యాలు, కేవలం స్త్రీకి మాత్రమే ఉన్నాయి.
ఆ స్పూర్తితో స్థాపించబడినదే “స్త్రీ సక్తి - సోషల్ స్ఫూర్తి”. స్ఫూర్తి కుటుంబం ట్రస్టులో, ఇదొక భాగంగా ఉంటూ, స్త్రీల అభ్యున్నతికై కృషి చేస్తూ, తద్వారా సమాజ సంస్కార సంస్కరణలో భాగమై, మానవతా ఆత్మీయతా సమాజ స్థాపనలో ముఖ్య భూమిక పోషిస్తుంది.
‘స్త్రీ శక్తి స్వరూపిణి’ అని కేవలం నినాదం వరకే మిగిలిపోకుండా, విధానంలో దాని నిరూపణ చేసే లక్ష్యంతో కృషి చేస్తుంది.
అబల అంటే జగతి సృష్టికి మూలమని, ప్రేమ మూర్తి, శక్తి రూపిణి, తాను తప్ప మరెవ్వరూ లేరని నిరూపించాలి స్త్రీ

