స్ఫూర్తి సత్సంగం

“సత్సంగం” అనే సంస్కృత పదంలో ‘సత్’ అనగా సత్యం, శుభం, సద్గుణం అనీ; ‘సంగం’ అనగా సమూహం, సమావేశం, కలిసికట్టుగా ఉండటం అనీ, అర్ధ భావాలుగా ఉన్నాయి. సత్సంగం అంటే మంచితనం, సత్య జ్ఞానం, ఆధ్యాత్మికతలను అభివృద్ధి చేసేందుకు ఒక సమూహంగా కలిసికట్టుగా నిర్వహించుకునే సమావేశం.

శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి గురుదేవుల దివ్య ఆశీస్సులతో నిర్వహించుకునే స్ఫూర్తి సత్సంగాలలో స్ఫూర్తి కుటుంబ సభ్యులు, వారి వారి స్వగృహాలలో లేదా నివాస సముదాయాలలో స్ఫూర్తి సత్సంగాలు నిర్వహించడం ద్వారా శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి గురుదేవుల దివ్య ఆశీస్సులు మరియు దివ్య జ్ఞానాన్ని పదుగురికి పంచగలరు. తద్వారా మానవతా, ఆత్మీయ సమాజాన్ని స్థాపించడానికి పాటుపడగలరు. అలాగే, ఈ స్ఫూర్తి సత్సంగాల ద్వారా, ఆయా ప్రాంతంలోని స్ఫూర్తి కుటుంబ సభ్యులు తరచుగా కలుసుకోవడం, తద్వారా ‘మన’ అనే సమైక్యతా భావం మరియు గురు భావనను పెంపొందించుకుంటారు.

స్ఫూర్తి సత్సంగంలో సాధారణంగా ఈ క్రింది విషయాలు జరుగుతాయి:

  • శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి గురుదేవులు మానవాళి ఉన్నతికై అందించిన సత్యజ్ఞానంను జీవితంలో భాగం చేసుకునేలా చర్చా సమావేశాలు నిర్వహించడం.
  • శ్రీ గురుదేవులు అందించిన ప్రస్థాన సాధనను (ఆసన - ప్రాణాయామ - ధ్యాన సాధన) ఆచరించడం.
  • మంచితనం, మానవత్వం, వంటి సద్గుణాలతో పాటు, ‘మన’ అనే సమైక్య భావం పెంపొందించుకోవడం.

స్ఫూర్తి సత్సంగం యొక్క ప్రయోజనాలు:

  • భౌతిక - ఆధ్యాత్మిక విజ్ఞానం పొందడం:
    శ్రీ గురుదేవులు అందించిన గ్రంథాలు, ప్రత్యక్ష, పరోక్ష బోధనలపై చర్చల ద్వారా మనలో ఆ సత్యజ్ఞానం, జీవితం పట్ల వాస్తవ దృష్టి, సద్గుణాలు పెరుగుతాయి.
  • మనసుకు శాంతి మరియు సంతోషం:
    స్ఫూర్తి సత్సంగంలో పాల్గొని, ప్రస్థాన సాధనను ఆచరించడం ద్వారా ఆలోచనలు శాంతిగా మారి, హృదయం ఆనందంతో నింపబడుతుంది.
  • సద్గుణాల అభివృద్ధి:
    మంచితనం, మానవత్వం, క్షమ, ధైర్యం, సహనం వంటి సద్గుణాలు పెరుగుతాయి.
  • సమైక్యత (Unity) బలపరచడం:
    స్ఫూర్తి సత్సంగంలో సభ్యులు తరచూ కలవడం కారణంగా ‘మన’ అనే భావన, మిత్రత, ఐక్యత పెరుగుతుంది.
  • స్ఫూర్తి కుటుంబాన్ని విస్తరించడం:
    శ్రీ గురుదేవులు అందించిన సత్యజ్ఞానం, సాధన పట్ల మంచి భావన కలిగిన వారు, కొత్త సభ్యులుగా చేరడం ద్వారా స్ఫూర్తి కుటుంబం పెరుగుతుంది.
  • మానవతా ఆత్మీయతా సమాజ స్థాపన - సామాజిక ప్రగతి:
    స్ఫూర్తి సత్సంగం ద్వారా వ్యక్తులు సద్గుణవంతులై, సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రేరణ పొందుతారు. తద్వారా మానవతా ఆత్మీయతా సమాజ స్థాపన జరుగుతుంది.