ఆధ్యాత్మిక విశ్వగురువు, పూర్ణ గురువు శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి వారు అనుగ్రహించిన దివ్యజ్ఞానం, ‘ధ్యాన మనోప్రస్థాన సాధన’, ‘ప్రాక్టికల్ ఫిలాసఫీ (ఆచరణాత్మక వేదాంతం)’, ‘రిలీజియస్ హ్యుమానిటీ’లను విశ్వ మానవ సమాజానికి అందుబాటులోకి తీసుకువెళ్లి, మానవతా విలువల వికాసం, వ్యక్తిత్వ పరివర్తన, భౌతిక–ఆధ్యాత్మిక సమన్వయతతో కూడిన జీవన విధానాన్ని ప్రోత్సహించాలనే సదుద్దేశంతో, పూర్ణ గురుదేవులు శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి వారి దివ్య ఆశీస్సులతో “స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్ - ఆంధ్రప్రదేశ్” 29 డిసెంబర్ 2021న ఆవిర్భవించింది.
పూర్ణ గురువులు శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి వారు నిర్దేశించిన ఆచరణాత్మక మార్గాన్ని అనుసరిస్తూ, వారి దివ్య ఆశీస్సులతో “దివ్య మానవతా స్ఫూర్తి”ని సమాజంలో విస్తరింపజేయలనే సంకల్పంతో వివిధ ఆధ్యాత్మిక, సేవా, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ విశ్వ మానవ శ్రేయస్సు దిశగా నిరంతరం కృషి చేస్తోంది.
నేటి సమాజంలో స్వార్థం, నైతిక విలువల క్షీణత, మానవ సంబంధాలలో పెరుగుతున్న దూరం వంటి కారణాల వల్ల వ్యక్తి, కుటుంబం, సమాజం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మానవతా విలువలను పునరుద్ధరించడం కాలానుగుణ అవసరం. ఈ భావాన్ని ప్రతిబింబించే పూర్ణ గురువులు శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి వారి “మానవతా రక్షతి రక్షితా” అనే నినాదమే స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్ కార్యాచరణకు మార్గదర్శక సూత్రం.