ప్రాక్టికల్ ఫిలాసఫీ

సాధారణంగా, ఫిలాసఫీ, వేదాంతం, సిద్ధాంత పరిధిలోనే ప్రచారమవుతూ ఉంటాయి. నమ్మకంలో అవి కలిసిపోయి వుంటాయి. అలాకాకుండా, తత్వాలు, సిద్ధాంత పరిధి దాటి, ఆచరణ స్థాయికి చేరి, జీవిత వినియోగం, ఉపయోగం కావాలన్నదే ‘ప్రాక్టికల్ ఫిలాసఫీ’ ధ్యేయం. సిద్ధాంతమైన, వేదాంతమైన,‘మనిషి వలన - మనిషి చేత - మనిషి కొరకే’, కనుక ఆచరణ సాధ్యతకు, ప్రయత్నించాలి. ఫిలాసఫీ అనే మాటకు గల అర్ధాలలో, తర్కం, హేతువాదమూ వున్నాయి కనుక, ఆచరణ సూచనలే! ప్రాక్టికల్ ఫిలాసఫీ, ఆచరణ, వినియోగ, ప్రత్యక్షత.

మనిషి జీవితంలో భౌతిక, ఆధ్యాత్మిక విరుద్ధతకంటే, అయోధ్యతకంటే, సయోధ్యతకే అవకాశం ఎక్కువగా వుంది. ఈ సమన్వయతా గుర్తింపే ‘ప్రాక్టికల్ ఫిలాసఫీ’ ధ్యేయం. శరీరం - మనసు, ప్రస్థానం ద్వారా, ఆత్మానుభూతిని పొందడమనేది, ధ్యానమనోప్రస్థాన మార్గం.

ధ్యానయోగం ద్వారా, మనసును, దాని భౌతిక స్థాయి నుండి, ఆధ్యాత్మిక అత్యున్నత స్థాయికి, ప్రస్థానించి, దానికి, ఆత్మానుభూతిని కలిగించడం..., దరిమిలా, అదే తిరోగమన అవరోహణ క్రమంలో, తిరిగి దాని భౌతిక స్వస్థాన సహజ సెన్సరీ (ఇంద్రియ) అనుభవ స్థితికి, సమన్వయతను, నిరూపించడమె, ప్రస్థాన మార్గంలో ప్రధాన ధ్యేయం... ఇదే ప్రాక్టికల్ ఫిలాసఫీ ఆచరణ మార్గం.

Guruji

సూక్షంగా చెప్పాలంటే, ధ్యాన సాధన ద్వారా వాస్తవ రీతి నిరూపణగా ప్రాక్టికల్ గా చూపించడమే ప్రాక్టికల్ ఫిలాసఫీ. ఈ విషయంలో శ్రీ గురుదేవులు మనలో ఒకరిగా, మానవ శరీరంతో అవతరించి, మనిషి జన్మ, జీవిత ప్రత్యేకత, విశిష్టత, ఆధ్యాత్మిక సాధ్యతను, ‘మీడియం మరియు రెడోలెన్సు’ విధానంలో, వారి పరమాత్మ తత్వమైన ‘సర్వ వ్యాపకత’, ‘సర్వ శక్తివంతం’, ‘సర్వజ్ఞత’ లను ఆచరణలో వాస్తవ రీతి నిరూపణగా చేసి చూపిస్తున్నారు.

నిరూపిత వాస్తవ వివరణే, ప్రాక్టికల్ ఫిలాసఫీ