Logo
స్ఫూర్తి కుటుంబందివ్య మానవతా స్ఫూర్తి - స్ఫూర్తి కుటుంబం ధ్యేయం
ENTE
హోమ్
ఆధ్యాత్మిక విశ్వగురువు
రెడోలెన్స్ప్రాక్టికల్ ఫిలాసఫీది సైంటిఫిక్ సెయింట్దివ్య మాధ్యమ విధానంరెలిజియస్ హ్యుమానిటీ
మెడిటేషన్ సెంటర్స్
గేలరీ
తెలుగు కేలండర్కార్యక్రమ ఫోటోలుకార్యక్రమ వీడియోలు
కార్యక్రమాలు
ప్రస్థాన సాధనగ్రంథ అధ్యయనంస్ఫూర్తి సత్సంగంస్ఫూర్తి సాధనా శిబిరం
స్త్రీ విభాగం
హోమ్ఇంగ్లీష్గ్యాలరీమెను

మీడియం విధానం

ఆకారం కలిగిన వస్తువైనా, జీవి శారీరమైన, ఏదైనా ఒకేసారి రెండు చోట్ల వుండదు, అనేది స్పష్టంగా సాధారణంగా తెలిసిన విషయమే. అలాగే మనసు దాని జ్ఞానం పూర్తిగ, వ్యక్తిగతమైనవే! మరొకరి ద్వారా వాటిని తెలియజేయడం సాధ్యం కాదు.

ఇలా సాధారణంగా కాక, భౌతికంగా ఒక చోటవుంటూ, మరోకచోట మనసును తెలియజేయగలిగితే? మాట్లాడగలిగితే?... ఇది వినటానికి అతిశయోక్తిగా ఉన్నప్పటికీ, యిది సాధ్యమే అని నిరూపించారు ఆధ్యాత్మిక విశ్వగురువు శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి వారు.

భౌతికంగా పూర్ణ గురుదేవులవారు వారి స్థానంలో వారు ఉంటూనే, సుదూరంలో ఉన్నటువంటి సాధారణ వ్యక్తి శరీరంలోకి ప్రవేశించి ఉపన్యాసించేవారు వారి వద్దకు వచ్చే వారితో మాట్లాడేవారు.

కేవలం ఒక వ్యక్తిలో ప్రవేశించడమే కాకుండా... ఓకే సమయంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న అనేకమంది వ్యక్తుల శరీరాలలోకి ప్రవేశించి... ఒకే సమయంలో విభిన్న విషయాలు ఉపన్యాసించేవారు, అక్కడకు వచ్చే వారియొక్క వ్యక్తిగత విషయాలు మాట్లాడేవారు, సమస్యలకు పరిష్కార మార్గాలు సూచించేవారు.

యిలా భౌతిక శరీరంతో వారు నివాసం వున్న స్థానంలోనే వుంటూ, కాలంతో - దూరంతో నిమిత్తం లేకుండా, ఏకకాలంలో, వివిధ ప్రాంతాలలో, భిన్న రీతులలో, విభిన్న సాధారణ వ్యక్తులలోకి ప్రవేశించి మాట్లాడే విధానమే శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి వారి దివ్య మాధ్యమ విధానం (డివైన్ మీడియం ప్రోసెస్).

ఈ విధానంలో గురుదేవులు వారు ప్రవేశించి మాట్లాడే మీడియం యొక్క వ్యక్తిగత మనసుతో గాని వారి జ్ఞానం, మెమోరీలతో నిమిత్తం లేకుండా, ‘గురువు గారు తన మనసుతోనే స్వయంగా’ అనేక విషయాలను గురించి, మాట్లాడేవారు.

మనిషికి తెలిసినవి, భౌతికం - ఆధ్యాత్మికం రెండే మార్గాలు. సైన్స్ - మతం - వేదాంతం, దేనిలోనైనా, యీ మీడియం విధానానికి అవకాశం లేదు; అయినా గురువుగారు చేయగగలిగారు, అంటే... యుగాల నుండి నేటి వరకు మనిషికి తెలిసిన భౌతిక ఆధ్యాత్మికమే కాకుండా, ‘మూడవది’ మరేదో సృష్టిలో ఉంది అనేది వాస్తవ రూపంలో గోచరిస్తోంది కదా!

Guruji blessings

శ్రీ గురుదేవులు, మీడియంల ద్వారా పలు ప్రాంతాలలో ఏకకాలంలో, భౌతిక - ఆధ్యాత్మిక - సైన్స్ వేదాంత విషయాలపై, ఆడియన్స్ అవగాహనను బట్టి వివిధ బాషలలో యిచ్చిన ఉపన్యాసాలు, రికార్డు రూపంలో సి.డి.లు మరియు యూట్యూబ్ లో వీడియోలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో ప్రత్యక్ష అనుభవాన్ని పొందిన వారూ ఎంతో మంది ఉన్నారు.

దివ్య మాధ్యమ విధానంలోనే కాకుండా మరో ప్రత్యేకమైన విధానం రెడోలెన్స్ విధానంలో పూర్ణ గురుదేవులు వారి యొక్క దివ్య ఉనికిని తెలియజేస్తుంటారు.

శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి వారి మీడియం మరియు రెడోలెన్స్ విధానాలు “నభూతో నభవిష్యతి”.

మమ్మల్ని సంప్రదించుటకు

స్ఫూర్తి కుటుంబం

(ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, మానవతా ధార్మిక సంస్థ)

రిజిస్టర్డ్ నం. 141/IV/2021

  • హౌస్ నంబర్: 21-11/7
  • రాజీవ్ గాంధీ వీధి, మధురానగర్
  • విజయవాడ, ఆంధ్రప్రదేశ్-520011
  • ఫోన్: +91 89775 19596, +91 89776 19596
  • ఈమెయిల్: office@ap.sphoorthikutumbam.org
మమ్మల్ని ఫాలో అవ్వండి
YouTubeWhatsApp
Privacy PolicyCopyright © 2026All rights reserved