రెడొలెన్స్ విధానం
పూర్ణ గురుదేవులు శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్పూర్తి వారు ఈ భూవిపై నడయాడిన సుమారు 80 సంవత్సరాల కాలంలో వారు ప్రత్యక్షంగా గాని పరోక్ష పద్ధతిలో మీడియం విధానం ద్వారా గాని వివిధ ఆధ్యాత్మిక కేంద్రాల్లో వారి దర్శనభాగ్యం జరుగుతూ ఉండేది.
గురువు గారికి సంబంధించిన కార్యక్రమాలు, వివిధ ప్రదేశాలలో, ఎక్కడ జరుగుతున్నా, అక్కడకి, వారు అదృశ్యంగా వస్తున్నట్లు గుర్తుగా, ఒక ప్రత్యేకమైన సువాసన వస్తుంది. ఈ విధానాన్ని ‘రెడొలెన్స్’ విధానంగా పిలుస్తాం.
ఇలా ప్రత్యక్షంగా గాని దివ్య మాధ్యమ విధానం ద్వారా మాత్రమే కాకుండా, మరో ప్రత్యేకమైన విధానంలో గురువుగారి యొక్క ఉనికిని (ప్రజెన్స్) తెలియజేస్తుంటారు.
అయితే కేవలం గురువు గారికి సంబంధించిన కార్యక్రమాల సందర్భంలోనే కాకుండా... బాహ్య ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ అది హాస్పటల్లో కావచ్చు ఆఫీసులో కావచ్చు లేక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఏ వ్యక్తికి అయితే గురువుగారు వారు ఉనికిని ఆ సమయానికి తెలియజేయాలి అనుకుంటారో, ఎంతమందిలో ఆ వ్యక్తి ఉన్నా, ఆ వ్యక్తికి మాత్రమే ఈ ప్రత్యేకమైన సువాసన వస్తుంది.
ఒకే సమయంలో, వివిధ రకాలుగా (సాంబ్రాణి, మల్లెపువ్వులు, అగరవత్తులు) ‘రెడొలెన్స్’ ద్వారా వారి ఉనికిని, వారి భక్తులు అనుభూతి చెందిన సందర్భాలు అనేకం.
అలాగే శ్రీ గురుదేవులు ప్రవచించిన, మూలమంత్రాన్ని, మౌనజపం చేస్తున్నవారికి కూడా యిదే అనుభవంతో పాటు, వారి దృశ్య - శ్రవణ అనుభూతి కూడా కలుగుతుంది. అలాగే, శ్రీ గురుదేవులు వారున్న చోటు నుండే, స్పిరిచ్యువల్ వైబ్రేషన్ ద్వారా వైద్య సంబంధ ట్రీట్ మెంట్లు కూడా చేస్తుంటారు.

ఇవన్నీ కల్పితాలు, లేక వ్యక్తిగత నమ్మకం, అభిమానం కారణంగా జరిగేవి, చెప్పేవి కావు. వివిధ ప్రాంతాలలో, ఆయా అనుభవాలు పొందిన వారి ద్వారా ఈ విషయాలు తెలుసుకోవడంతో పాటు వారు అనుగ్రహించిన దివ్య మూలమంత్రాన్ని సాధన చేయడం ద్వారా స్వయంగా ఈ అనుభూతి పొందుట ద్వారా, పూర్ణ గురుదేవుల యొక్క దివ్య ఉనికిని అనుభూతి చెందవచ్చు.
శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి వారి మీడియం మరియు రెడోలెన్సు విధానాలు “నభూతో నభవిష్యతి”.

