రెలిజియస్ హ్యూమానిటీ

రిలీజియన్ (Religion) అంటే మతం. మరి రిలీజియస్ (religious) అంటే? “మనిషికి మతానికి మధ్య ఉన్న తీవ్రస్థాయి అభిమానం, నమ్మకం, విశ్వాసం, భక్తి వగైరా సహజ బంధాన్ని తెలియజేయడమే, ‘రెలిజియస్’ అనడంలోని భావన”.

నేటి మత వ్యవస్థ, మనిషి - మతం - దేవుడు అనే విధానంలో, దేవుడి పేరున మతం, మతం కోసం మనిషి. ఇక్కడ దేవుడి పేరు మీద, మతానికి మనిషికి దృఢమైన విశ్వాస వారసత్వ బంధం ఉంది. మానవ చరిత్ర పరిశీలనలో, దేవుడి మతంలో మనిషి ఉనికి నిమిత్త మాత్రమే సుమా!

మతాల మధ్య సామరస్యత లోపించడం వలన మత ఘర్షణలతో పాటు విపరీతమైన అసమ్మతి సమాజంలో పెరగడం అందరికీ ప్రత్యక్ష అనుభవమే. ప్రస్తుత మత విధానంలో, దేనికదే ఉత్తమం అనే భావంలో, ఇతర మతాలను సహించలేని స్థితిలో, మతం ద్వారా మనిషికి మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుందనేది వాస్తవ రూపంలో కనబడుతూనే ఉంది కదా! మనిషి పుట్టుకతోనే తత్సంబంధ కులం, మతం, స్థిరపడుతున్నాయి కనుక, మతాన్ని కాదనడానికి, వద్దు అనడానికి అవకాశం లేదు. ప్రత్యక్ష పరోక్ష రీతిలో, మత ప్రమేయం అనివార్యం. జన్మ వారసత్వంగా వస్తోంది కదా మరి! అందుకే రెలిజియన్ అనేది తప్పదు కనుక, ఆ విధానంలోనే దానిని సంస్కరించే ప్రయత్నంలో, రెలిజియన్ ను భాగం చేసుకుంటూ, ‘రెలిజియస్ హ్యుమానిటీ’ కాన్సెప్ట్ ను ప్రతిపాదించి, ప్రభోదించబడుతున్నది.

అయితే రెలిజియస్ హ్యుమానిటీ పద్దతిలో, ‘మనిషి కోసం మానవత్వం, మానవత్వం మానవ సమాజానికి’ అనే విధానంలో ఉంటుంది. మానవజాతి పేర, మనిషికి, మానవత్వానికి ఆచరణాత్మక అవినాభావ సంబంధం, స్థిరపడాలనేదే ‘రెలిజియస్ హ్యుమానిటీ’ ధ్యేయం. ‘రెలిజియస్ హ్యూమనిజం’లో, దైవారాధన పేర ఆధ్యాత్మిక ఉన్నతితో పాటు, మానవత, ఆత్మీయత, ఆదర్శ ప్రాధాన్యతను కలిగి ఉంటుంది.

Guruji blessings

అలాగే, మానవజాతిని మానవ కుటుంబంగా, దానిని అంతర్జాతీయ వ్యవస్థగా మార్చగలిగిన ‘హ్యూమన్ గ్లోబలైజేషన్’కు రెలిజియస్ హ్యూమనిజం కృషి చేస్తుంది.

‘రెలిజియస్ హుమానిటీ’లో, మతనమ్మకం, దైవభక్తితో పాటు, మంచి, మానవత్వం కూడా గుర్తుకు వస్తుంది. మానవ సమాజానికి పరోక్ష మేలు కలుగుతుంది. వ్యక్తి ఉపకారానికి వీలుంది. అందుచేత, ‘రెలిజియస్ హుమానిటీ’ భావం, మత సంబంధ, పరిధిలోనిది కాదు. మానవ సమాజ, వ్యాప్తి, అన్వయతను, కలిగినది. మనిషి మనసుకు, ‘పాజిటివ్’ ఆలోచన పెరుగుదలకు ఉపయోగం.

మానవతో రక్షతి రక్షితః