ట్రస్ట్ సభ్యత్వం
స్ఫూర్తి కుటుంబం సంస్థ, “దివ్య మానవతా స్ఫూర్తి”, ధ్యేయంతో, మనిషికి మానవత్వం సహజతత్త్వం కావాలని, తద్వారా మానవతా సమాజం ఏర్పాటు కావాలని కృషి చేస్తోంది. ఆధ్యాత్మిక విశ్వగురువు శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి వారి ధ్యానమనోప్రస్థానం, రిలీజియస్ హ్యుమానిటీ, ప్రాక్టికల్ ఫిలాసఫీ బోధనల పట్ల అవగాహన ఏర్పరచడం ద్వారా ప్రతి మనిషి, తనలోనే ఉన్న నిక్షిప్త శక్తిని ఉత్తేజపరిచి, ఉద్వేగపరిచి, ప్రోత్సహించి దానిని క్రియాశీలతగా, నిర్మాణాత్మక సాధనంగా మలిచి వ్యక్తిత్వ ఉత్తేజితునిగా నిలబెట్టడానికి వేదికలా పని చేస్తుంది స్ఫూర్తి కుటుంబం సంస్థ.
శ్రీ గురుదేవుల శిష్యులకు, అనుచరులకు మరియు గురుదేవులు అనుగ్రహించిన సాధనా మార్గాన్ని అనుసరిస్తూ, స్ఫూర్తి కుటుంబంలో భాగం కావాలనుకునే వారికి వివిధ ఎంపికల సభ్యత్వాన్ని స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్ అందిస్తోంది.
మరిన్ని వివరములకు:91-8977539596

